Ravi Teja | మళ్లీ థియేటర్లలో ‘కృష్ణ’ … రవితేజ మాస్ వినోదం రీ-రిలీజ్‌కు రెడీ
Ravi Teja | మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఘన విజయాన్ని అందుకున్న యాక్షన్ కామెడీ చిత్రం ‘కృష్ణ’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2008లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు మే 8న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించగా, అందాల నటి త్రిష కృష్ఱన్ హీరోయిన్గా నటించారు.
Ravi Teja | మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఘన విజయాన్ని అందుకున్న యాక్షన్ కామెడీ చిత్రం ‘కృష్ణ’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2008లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు మే 8న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించగా, అందాల నటి త్రిష కృష్ఱన్ హీరోయిన్గా నటించారు. విడుదలైన సమయంలో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని రవితేజ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రత్యేకంగా రవితేజ ఎనర్జీ, శైలీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక హాస్యనటుడు బ్రహ్మనందం తో కలిసి చేసిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. ఈ జంట మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మరింత ప్రాధాన్యం తీసుకువచ్చాయి.
సంగీత దర్శకుడు చక్రి అందించిన పాటలు అప్పట్లోనే విశేష ఆదరణ పొందాయి. ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. యాక్షన్, హాస్యం, సంగీతం అన్నీ కలిసిన ఈ చిత్రం సంపూర్ణ వినోదాన్ని అందించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మెరుగైన నాణ్యతలో తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో కొత్త తరానికి కూడా ఈ సినిమా చూడడానికి మంచి అవకాశం లభించనుంది.
పాత హిట్ చిత్రాల రీ-రిలీజ్‌లకు ప్రస్తుతం మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ‘కృష్ణ’ కూడా థియేటర్లలో మళ్లీ విజయాన్ని అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ అభిమానులు ఈ సినిమాను పెద్ద తెరపై మరోసారి ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కృష్ణ’ రీ-రిలీజ్ పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించబోతోంది. ఇక హిట్స్ లేకపోయిన కూడా రవితేజ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీవిష్ణుతో ‘రాజరాజ చోర’ లాంటి చిత్రాన్ని రూపొందించిన హసిత్ గోలీ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ పోషించిన అత్తిలి సత్తిబాబు పాత్ర చెప్పే డైలాగ్ నుంచే ఈ టైటిల్ పుట్టిందని ఇన్సైడ్ టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

