Ravanasura Movie | ‘ప్యార్‌లోన పాగల్’ అంటున్న రవితేజ.. రావణాసుర ఇంట్రెస్టింగ్ అప్డేట్
మాస్ మహరాజా రవితేజ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సాధించి పట్టుకోల్పోయిన తన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. ప్రస్తుతం రవన్న హ్యట్రిక్‌పై కన్నేశాడు.
Ravanasura Movie | మాస్ మహరాజా రవితేజ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సాధించి పట్టుకోల్పోయిన తన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. ప్రస్తుతం రవన్న హ్యట్రిక్‌పై కన్నేశాడు. ఇక రవితేజ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే రిలీజైన రావణాసుర ఆంథమ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది.
‘ప్యార్‌లోన పాగల్’ అంటూ సాగే సెకండ్ పాటను ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించాడు. హర్షవర్ధన్ సరికొత్త ట్యూన్స్ శ్రోతలను ఆట్టుకుంటున్నాయి. మొదటి పాటలానే, ఈ పాట కూడా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
After a reverberating Anthem🔥
Get ready to ignite the dance floor with Mass Maharaja's high-energy song❤️🔥🕺#PyaarLonaPaagal Lyric Video on Feb 18th🎶#Ravanasura @RaviTeja_offl @sudheerkvarma @AbhishekPicture @rameemusic @SrikanthVissa @itswetha14 @saregamasouth pic.twitter.com/kUF4CLHrQD
— RT Team Works (@RTTeamWorks) February 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

