వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు.. ట్రోలర్స్‌కు రష్మిక మందన్న వార్నింగ్
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇటీవల ‘కాఫీ విత్ కరణ్-9’షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. రష్మిక తనకు చేసిన పెళ్లి ప్రపోజల్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘రష్మిక పెళ్లి చేసుకోమని నన్ను వందసార్లు అడిగింది’ అన్నారు.
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇటీవల ‘కాఫీ విత్ కరణ్-9’షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. రష్మిక తనకు చేసిన పెళ్లి ప్రపోజల్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘రష్మిక పెళ్లి చేసుకోమని నన్ను వందసార్లు అడిగింది’ అన్నారు. ఆయన మాటలు సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో తమ వ్యక్తిగత జీవితంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను రష్మిక మందన్న తీవ్రంగా ఖండించింది. తమ ప్రేమ, పెళ్లి గురించి ఇతరులు తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తాము ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాల్లోని వాస్తవాలను అంగీకరించకుండా..వాటికి వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘నేను కాస్త ఎమోషనల్‌గా ఆలోచిస్తా. కానీ విజయ్ మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. జీవితాన్ని భిన్న దృక్కోణాల్లో దర్శించే మా ఇద్దరి స్వభావాలే బంధాన్ని మరింత బలంగా ఉంచుతున్నాయి. జీవితంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు సమయం తీసుకొని ఆలోచించడంలో తప్పులేదు. విజయ్ అదే పనిచేశాడు. పెళ్లంటే ఉంగరాలు మార్చుకోవడం, ఘనంగా సంబరాలు చేసుకోవడం కాదు. ఇద్దరూ కలిసి ఓ జీవితాన్ని నిర్మించుకోవడం.విజయ్ అంటే నాకు పిచ్చి ప్రేమ. నాకు గాయమైనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అర్థరాత్రి ఆందోళనతో నిద్రలేచినప్పుడు మీరెవరూ నా పక్కన లేరు. విజయ్ ఉన్నాడు. నేను మానసికంగా కుంగిపోయినప్పుడు అతని భుజమే నాకు ఆధారం’ అంటూ రష్మిక మందన్న పేర్కొన్నది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆ ఉత్సాహం తన ముఖంలో, నటనలో, జీవితాన్ని గడుపుతున్న తీరులో ప్రతిఫలిస్తున్నదని రష్మిక మందన్న చెప్పింది. తనపై ఎలాంటి విమర్శలు చేసినా భరిస్తానని, కానీ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆమె హెచ్చరించింది.
సైబర్‌క్రైమ్‌లో విరోష్ టీమ్ ఫిర్యాదు
తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) టీం సోమవారం సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విరోష్ టీమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్‌మీడియా ఫేక్‌పోస్టులు, అకౌంట్స్, స్క్రీన్‌షాట్స్ ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్ డీసీపీకి వారు అందజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

