Rashmika Mandanna | రవితేజతో రష్మిక జోడీ.. మళ్లీ క్రాక్ తెప్పిస్తారా!
దేశవ్యాప్తంగా ఉన్న బిజీయ్యస్ట్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. భాషలకు అతీతంగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయారామె. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్‌తో కలిసి ఆమె చేస్తున్న ‘యానిమల్' సినిమా డిసెంబర్లో విడుదల కానుంది.
Rashmika Mandanna | దేశవ్యాప్తంగా ఉన్న బిజీయ్యస్ట్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. భాషలకు అతీతంగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయారామె. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్‌తో కలిసి ఆమె చేస్తున్న ‘యానిమల్’ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘రెయిన్బో’ సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. ఇక ‘పుష్ప-2’ ఎలాగూ ఉంది.
ఇప్పుడు ఇదంతా దేనికంటే.. ఇంత బిజీగా ఉండికూడా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట రష్మిక. అది కూడా సాదాసీదా సినిమాకాదు. రవితేజ, మలినేని గోపీచంద్‌ల సినిమా. డాన్‌శీను, బలుపు, క్రాక్ సినిమాలతో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న కాంబినేషన్ ఇది. మరి వీరిద్దరి నాలుగో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు వీరిద్దరికి తోడు రష్మిక కూడా జత కలిసిందంటున్నారు. రవితేజ, రష్మిక కలిసి నటించడం ఇదే ప్రథమం. ఇద్దరి ఎనర్జీ లెవల్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇక ఎంటర్టైన్మెంట్కి కొదువుండదు. ‘క్రాక్’ మాదిరిగానే వాస్తవ సంఘనల ఆధారంగా ఈ కథను తయారు చేశారట మలినేని. క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాలకు మాటలు రాసిన సాయిమాధవ్ బుర్రానే ఈ సినిమాకి కూడా సంభాషణలు అందిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి మొదలుకానున్నట్టు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

