RAPO20 | పంచెకట్టులో రామ్.. RAPO20 రిలీజ్ అప్డేట్ పోస్టర్ వైరల్
RAPO20 | మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) కాంబోలో వస్తున్నమూవీ RAPO20. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
RAPO20 | టాలీవుడ్ సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాల్లో ఒకటి RAPO20. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) కాంబోలో వస్తున్న ఈ మూవీని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే సినిమా అనుకున్న సమయానికంటే ముందుగా థియేటర్లలోకి రాబోతుందని వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ క్లారిటీ ఇస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు కొత్త లుక్‌తో తెలియజేశారు. రామ్ పంచెకట్టులో పంట పొలాల మధ్య మంచంపై రిలాక్స్ మూడ్‌లో ఉన్న లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే రామ్ అండ్ టీం మైసూర్ షెడ్యూల్లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కీ రోల్లో నటిస్తోంది.
ఇప్పటికే RAPO20 నుంచి విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచడంతోపాటు సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అఖండ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో RAPO20పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే 24 రోజులపాటు స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసినట్టు అప్డేట్ అందించి.. అభిమానులను ఖుషీ చేశాడు రామ్.
RAPO20 రిలీజ్ అప్డేట్ పోస్టర్..
Massive Energy Striking Early in Theatres⚡️💥#BoyapatiRAPO Worldwide Release on SEP 15th in Telugu,Tamil, Kannada, Malayalam & Hindi🔥#BoyapatiRAPOonSep15❤️🔥
Ustaad @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @MusicThaman @srinivasaaoffl @detakesantosh @StunShiva8 @SS_Screens… pic.twitter.com/2lpwejNekU
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

