Chiranjeevi | రాణీకి మెగా ఆఫర్.. చిరుకు జోడీగా ఒకనాటి బాలీవుడ్ అందాలభామ?
ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీని ఓ క్రేజీ ఆఫర్ వరించిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.. పైగా అది హిందీ సినిమా కాదు.. తెలుగు సినిమా.
Chiranjeevi | ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీని ఓ క్రేజీ ఆఫర్ వరించిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.. పైగా అది హిందీ సినిమా కాదు.. తెలుగు సినిమా. అదికూడా చిరంజీవి సినిమా. వివరాల్లోకెళ్తే.. చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. గొప్ప నటీమణులు మాత్రమే పోషించదగ్గ పాత్ర అని తెలుస్తున్నది.
ఆ పాత్రకు రాణీ ముఖర్జీ పేరును సూచించారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆ ప్రపోజల్‌కి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టుగా, డిగ్నిఫైడ్‌గా ఉంటుందని చిరంజీవి భావించడం వల్ల ఆ పాత్ర రాణీ ముఖర్జీని వరించిందని ఫిల్మ్ వర్గాల టాక్. చిరంజీవి 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీపొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

