తహశీల్దార్ రామారావు
1995 నాటి యథార్థ సంఘటనల స్ఫూర్తితో రవితేజ కథానాయకుడిగా రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. త్వరలోనే ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ైస్టెలిష్ లుక్స్తో ఆకట్టుకుంటున్నారు రవితేజ. ‘ఈ సినిమాలో రవితేజ తహశీల్దార్గా కనిపిస్తారు. వృత్తి పట్ల అంకితభావం ప్రదర్శించే ప్రభుత్వ ఉద్యోగి అసాంఘిక శక్తులపై చేసిన పోరాటం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. రవితేజ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ రోమాంచితంగా సాగుతాయి. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

