Ram: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఇస్మార్ట్ హీరో న్యూ లుక్

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్లోనే బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామితో యాక్షన్ ఓరియెంటెడ్ సినియా చేస్తున్న విషయం తెలిసిందే. ముప్పై రోజుల పాటు జరిగిన తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న రామ్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోను రూపొందనుంది.
ఈ సినిమా కోసం రామ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భారీగా కండలు పెంచి సరికొత్త లుక్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫిజిక్ పరంగా సరికొత్త రామ్ పోతినేనిని అభిమానులకు పరిచయం చేస్తున్నాడు రామ్. త్వరలో యాక్షన్ సీన్లు తెరకెక్కించనుండగా,వాటి కోసం రామ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఈ సినిమా, ఇందులో ఫైట్లు ఊరమాస్గా ఉంటాయని తెలిసింది.
రామ్ను ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ఇస్మార్ట్ శంకర్లో గడ్డం పెంచి రగ్డ్ లుక్తో కనిపించిన రామ్..రెడ్లో అదే లుక్ను మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో రామ్ కనిపించబోతున్నాడు. రామ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఆయన సరసన హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

