Ram Charan | నాన్న క్రమశిక్షణే నాకు స్ఫూర్తి .. తండ్రిపై చరణ్ ఆసక్తికర కామెంట్స్
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మొదట ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్న ఈ మూవీని, ప్రేక్షకులకు మరింత మెరుగైన థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు జూన్‌కు వాయిదా వేసారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మొదట ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్న ఈ మూవీని, ప్రేక్షకులకు మరింత మెరుగైన థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు జూన్‌కు వాయిదా వేసారు.ఇక ఇదిలా ఉంటే, రామ్ చరణ్ మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకున్నారు. ప్రతిష్టాత్మక ‘ఈ స్క్వేర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై చోటు దక్కించుకున్న టాలీవుడ్ హీరోగా ఆయన ప్రత్యేక రికార్డ్ సృష్టించారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రభావం గురించి మాట్లాడుతూ, “నా జీవితంలో నిజమైన హీరో నాన్నే” అని గర్వంగా తెలిపారు. నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం తమకు సులభంగా అనిపించినప్పటికీ, ఆయన పడ్డ కష్టం మాత్రం అపారమని అన్నారు. సినిమాల కోసం చిరంజీవి పడే కష్టం గురించి చెబుతూ, షూటింగ్‌ల సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా కుటుంబానికి సమయం కేటాయించడంలో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదని వెల్లడించారు.
ఎంతటి స్టార్డమ్ ఉన్నా ఇంట్లో మాత్రం సాధారణ తండ్రిలా ఉండటం చిరంజీవి ప్రత్యేకత అని కొనియాడారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమ వ్యక్తులకు అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. వృత్తిపరమైన బాధ్యతలు, కుటుంబ బంధాలను సమన్వయం చేసుకోవడం ఎలా అనేది తన తండ్రిని చూసే నేర్చుకున్నానని చరణ్ తెలిపారు.ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగే చిరంజీవి తత్త్వం తనపై ఎంతో ప్రభావం చూపిందని, ప్రస్తుతం తాను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. మూడు రోజులు విరామం దొరికినా కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చే ఆయన క్రమశిక్షణ తనకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Klinkaara
- peddi
- ram charan
- surekha
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

