Rakul Preet Singh | పెండ్లి తర్వాత డ్రెస్సింగ్ స్టైల్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై రకుల్ సెటైర్లు
Rakul Preet Singh | వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో సూపర్ బ్రేక్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ భామ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ ఇద్దరూ గోవాలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌తో ఒక్కటయ్యారు. అయితే ఓ రిపోర్టు అడిగిన ప్రశ్న రకుల్‌కు కోపం తెప్పించింది.
Rakul Preet Singh | వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో సూపర్ బ్రేక్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఆ తర్వాత తారక్, రాంచరణ్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. రకుల్ రీసెంట్గా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీభగ్నానీ (బాయ్ ఫ్రెండ్)తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిందని తెలిసిందే. ఈ ఇద్దరూ గోవాలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌తో ఒక్కటయ్యారు. అయితే ఓ రిపోర్టు అడిగిన ప్రశ్న రకుల్‌కు కోపం తెప్పించింది.
ఇప్పుడు పెళ్లయింది కదా.. మరి బోల్డ్ డ్రెస్సింగ్‌తో సర్దుకుంటారా.. అని అడిగాడు. దీనికి రకుల్ ఏ మాత్రం తడబడకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ పట్ల భర్త జాకీ భగ్నానీ చాలా కూల్‌గా ఉన్నాడని చెప్పింది. అంతేకాదు అత్తగారి వైపు నుంచి కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని, తనకు నచ్చినట్టుగా ఉండే స్వేచ్చను కల్పించారని చెప్పింది. మీడియా ఎందుకని మేల్ యాక్టర్లను పెళ్లి తర్వాత ఇలాంటి ప్రశ్నలు అడగదని ప్రశ్నించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది రకుల్. ఇంకేంటి మరి తాజా కామెంట్స్‌తో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అభిమానుల కోసం మునుపటిలానే ప్రొఫెషనల్‌గా ముందుకెళ్తారని క్లారిటీ ఇచ్చేసినట్టే.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం శంకర్-కమల్ హాసన్‌ల భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ఇండియన్ 2లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Rakul Preet Singh

న్యూ ఇయర్ వెకేషన్లో..
#RakulPreetSingh New Year Celebrations Latest Clicks..
.
.#RakulPreetSingh #SSMB29 #tollywoodactress #Tollywood #RakulPreet pic.twitter.com/XujTza4spJ— Suvarna Media (@suvarna_media) January 1, 2024
బీచ్‌లో రకుల్ షికారు ఇలా..
.@Rakulpreet is wild and free, just like the sea ❤️
.
.#RakulPreetSingh | #RakulPreet pic.twitter.com/Kxxi5wOhy3— Bollywood Buzz (@BollyTellyBuzz) June 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

