Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ధర్మన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్ హీరోగా చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కథాంశంతో పాటు రజినీకాంత్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ధర్మన్’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా రెండో షెడ్యూల్‌ను కూడా మేకర్స్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా షూటింగ్‌కు సంబంధించిన ఓ క్రేజీ ప్రోమోను కూడా విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు అనుసరిస్తున్న వేగం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక సీక్వెన్స్ లేదా షెడ్యూల్ కోసం నాలుగు రోజులు ప్లాన్ చేస్తే.. దర్శకుడు దానిని కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేస్తున్నారట. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడం ఒక ఎత్తయితే.. అదే సమయంలో ఔట్పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకపోవడం మరో విశేషంగా చెబుతున్నారు. ప్లాన్ చేసిన సమయంలో సగం రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేస్తున్నప్పటికీ, సన్నివేశాల క్వాలిటీ, మేకింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దీంతో ‘ధర్మన్’ అనుకున్నదానికంటే చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే వేగాన్ని దర్శకుడు కొనసాగిస్తే.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రజినీకాంత్ సినిమాల్లో మాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ సీన్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తనదైన శైలిలో రజినీకాంత్‌ను ఎలా చూపించబోతున్నారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సినిమాపై క్యూరియాసిటీ పెంచడంతో.. పూర్తి స్థాయిలో సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ధర్మన్’ సినిమాకు మరో భారీ ఆకర్షణగా అనిరుధ్ రవిచందర్ సంగీతం నిలవనుంది. రజినీకాంత్ సినిమాలకు అనిరుధ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గతంలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి.