Varanasi Movie | ‘దేవర’ సెట్స్‌లో మహేష్ ‘వారణాసి’: రాజమౌళి మాస్టర్ ప్లాన్!
Varanasi Movie | సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న 'వారణాసి' (Varanasi) సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే.
Varanasi Movie | సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ‘వారణాసి’ (Varanasi) సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం వారణాసి టీమ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం వాడిన టెక్నికల్ బ్యాక్‌డ్రాప్‌ను (ప్రత్యేకంగా అండర్ వాటర్/వాటర్ సెట్స్) వినియోగించబోతున్నట్లు తెలుస్తుంది.
‘దేవర’ సినిమాలోని సముద్రపు సన్నివేశాల కోసం హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద భారీ వాటర్ ట్యాంక్ సెట్‌ను, బ్లూ మ్యాట్ (Blue Matte) టెక్నాలజీతో రూపొందించారు. ఇప్పుడు అదే సెట్‌ను ‘వారణాసి’లో గంగా నది నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాల కోసం రీ-డిజైన్ చేసి వాడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షెడ్యూల్ విదేశాల్లో జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు రిస్క్ అని భావించిన రాజమౌళి, తెలివిగా ప్లాన్ మార్చి హైదరాబాద్‌లోనే షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సెట్లో మహేష్ బాబుపై భారీ రివర్ ఛేజ్ మరియు కొన్ని హై-టెక్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ‘దేవర’లో వాడిన అడ్వాన్స్డ్ సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ మరియు వాటర్ షూట్ ఎక్స్‌పర్టీస్‌ను ఈ షెడ్యూల్ కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రయూనిట్ కానీ, దేవర టీమ్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

