Radheshyam | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు,లిరికల్ సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతంగా అంచనాలను పెంచాయి. పిరీయాడిక్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రికా నిపుణుడిగా నటిస్తున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం నుంచి వాలెంటైన్స్ డే టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మార్చి 11న పేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటుగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రజెక్ట్- K కూడా షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఇక సందీప్‌రెడ్డి రూపొందిస్తున్న స్పిరిట్ ప్రస్తుతం స్క్రీప్ట్ దశలో ఉంది.