Radhe Shyam Collections | దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను పలకరించాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీదలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 11న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. దానికి తోడుగా ఈ చిత్రానికి నెగిటీవ్ రివ్యూస్ రావడం, సినిమా బాగా స్లోగా ఉందని చెప్పడం వంటివి కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపాయి. పీరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా లవర్‌బాయ్ పాత్రలో నటించాడు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్ కమర్షియల్ స్టోరి కాకుండా ఒక లవ్ స్టోరి కథలో నటించినందుకు ఆయన గట్స్‌కు మెచ్చుకోవాలి అంటూ పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి వీకెండ్‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌తోనే 151 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఏరియా వైజ్‌గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఒకసారి గమినిస్తే..
నైజాం : 21.85 కోట్లు
సీడెడ్ : 6.76 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.35 కోట్లు
ఈస్ట్ : 3.87 కోట్లు
వెస్ట్ : 3.01 కోట్లు
గుంటూరు : 4.03 కోట్లు
కృష్ణ : 2.34 కోట్లు
నెల్లూరు : 1.87 కోట్లు
ఏపి+తెలంగాణ : 48.08 కోట్లు
ఓవర్సీస్ : 10.55 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 8.62 కోట్లు
నార్త్ ఇండియా(హిందీ వెర్షన్) :6.80 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 74.05 కోట్లు
‘రాధేశ్యామ్’ చిత్రానికి దాదాపు 208 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ సాధించాలంటే 210 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం మూడు రోజులకు 74.05 కోట్ల కలెక్షన్లను సాధించింది. కేవలం ఫ్లాప్ టాక్‌తోనే ఇంత కలెక్షన్లను సాధించిందంటే అది కేవలం ప్రభాస్ వల్లే సాధ్యమైంది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 151కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ప్రభాస్ నటించిన గత చిత్రాలు ‘సాహో’, ‘బాహుబలి2’ సినిమాలతో మాదిరిగా ఈ చిత్రం కూడా మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి హ్యట్రిక్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ ‘రాధేశ్యామ్’ చిత్రానికి మొదటి షో నుంచే డివైడ్ టాక్ రావడంతో ప్రభాస్ హ్యట్రిక్ను మిస్ చేసుకున్నాడు.