PVR Cinemas | సినీ ప్రియులకు గుడ్‌న్యూస్ : స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ధరలను తగ్గించిన పీవీఆర్
కుటుంబసభ్యులతో కలిసి సింగిల్ స్క్రీన్‌లో సినిమాలు చూసి ఎంచక్కా కూల్‌డ్రింక్స్, సమోసా ఎంజాయ్ చేసినా తక్కువ ఖర్చుతో బయటపడేవాళ్లం. అయితే మల్టీప్లెక్స్‌ల (PVR Cinemas) హవా మొదలైన తర్వాత మూవీ థియేటర్లు పోష్ కేఫ్‌లకు ఏమాత్రం తక్కువగా లేవు.
ముంబై : గత కొన్నేండ్లుగా థియేటర్లో సినిమా చూసే అనుభూతిలో మార్పులొచ్చాయి. కుటుంబసభ్యులతో కలిసి సింగిల్ స్క్రీన్‌లో సినిమాలు చూసి ఎంచక్కా కూల్‌డ్రింక్స్, సమోసా ఎంజాయ్ చేసినా తక్కువ ఖర్చుతో బయటపడేవాళ్లం. అయితే మల్టీప్లెక్స్‌ల (PVR Cinemas) హవా మొదలైన తర్వాత మూవీ థియేటర్లు పోష్ కేఫ్‌లకు ఏమాత్రం తక్కువగా లేవు.
మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ బ్యాగ్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి లేదా ఓ కిడ్నీ అయినా అమ్మేయాలనే రేంజ్లో పలు వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇక నోయిడా పీవీఆర్ సినిమాస్‌లో పాప్‌కార్న్, పెప్సీకి ఏకంగా రూ. 460, రూ. 360 ఖర్చు చేశానని ఓ వ్యక్తి ఇటీవల చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ మొత్తం ప్రైమ్ వీడియో వార్షిక సబ్స్క్రిప్షన్ అంత ఉందని ఆ వ్యక్తి వాపోయాడు. కుటుంబంతో కలిసి సినిమా చూడటం ఏమాత్రం భరించలేమని ఆ ట్వీట్లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో పీపీఆర్ సినిమాస్ స్పందించింది.
ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తాము గౌరవిస్తామని, దేశంలో సినీ ప్రియులందరి కోసం ఈ అప్డేట్ అందిస్తున్నామని ట్విట్టర్లో రాసుకొచ్చింది. పీవీఆర్ షేర్ చేసిన నూతన ధరల పట్టిక ఆధారంగా అన్లిమిటెడ్ పాప్‌కార్న్, పెప్సీ ఫ్రీ రీఫిల్స్‌ను వీకెండ్ ఆఫర్‌గా అందిస్తున్నామని పేర్కొంది. వీక్‌డేస్‌లో సోమవారం నుంచి గురువారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ బర్గర్, సమోసా, శాండ్విచ్, పెప్సీ వంటి ఐటెమ్స్‌ను పీవీఆర్ రూ. 99కే ఆఫర్ చేస్తుందని తెలిపింది.
Read More :
FIFA | ఫుట్‌బాల్ క్లబ్స్‌కు భారీ బొనాంజా.. రూ. 1000 కోట్లపైనే ముట్టజెప్పనున్న ఫిఫా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Popcorn
- prices
- PVR Cinemas
- reduced
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

