ఫ్యాన్స్ క్రియేటివిటీ.. పీఎస్పీకే 28 పోస్టర్‌కు సూపర్భ్ రెస్పాన్స్

అభిమానులు తమ అభిమాన హీరోలను ఆరాధించడమే కాదు తమలో దాగి ఉన్న కొత్త టాలెంట్‌ను బయటకు తీస్తూ స్టన్నింగ్ పోస్టర్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ పోస్టర్స్ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ మాదిరిగానే ఉండడంతో అవి నిజమా, ఫేకా అనేది గుర్తించడం కష్టంగా మారింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందనున్న పీఎస్పీకే 28కి సినిమాకి సంబంధించిన పోస్టర్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
తొమ్మిదేళ్ల తర్వాత పవన్ – హరీష్ కాంబోలో ‘#PSPK28’ అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. రోజులు గడిచే కొద్దీ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుతూ పోతున్నారు. పవన్ నటించిన వకీల్ సాబ్ చిత్రం రీసెంట్గా విడుదలై పెద్ద విజయం సాధించడంతో పీఎస్పీకే 28పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా పీఎస్పీకే 28 ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఈ రేంజ్ లో ఉంటే అఫీసియల్ పోస్టర్ ఎలా ఉంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ ‘#PSPK28’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. 2021 ద్వితీయార్థంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
గ్రేటర్ వరంగల్‌లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
IPL 2021: ధోనీ vs కోహ్లి.. ఆసక్తి రేపుతున్న సూపర్ సండే ఫైట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

