Producer Naga Vamsi | నాకు మీ సపోర్ట్ కావాలి.. అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్న ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీ
టాలీవుడ్ అగ్ర నిర్మాత నాగవంశీ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం ఎక్స్ వేదికగా అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నాడు.
Producer Naga Vamsi | టాలీవుడ్ అగ్ర నిర్మాత నాగవంశీ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం ఎక్స్ వేదికగా అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj). నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వాల్తేరు వీరయ్యతో 2023లో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం.
ఇదిలావుంటే ఈ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్‌పై నెట్టింటా ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో మూవీపై కూడా నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపించట్లేదు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీలో ఉన్న గొడవలతో బాలకృష్ణ, తారక్ దూరంగా ఉంటూ వస్తున్నారు. రీసెంట్గా దేవర సినిమా అప్పుడు కూడా బాలకృష్ణ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో బాలకృష్ణ డాకు మాహరాజ్ని టార్గెట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.
అయితే ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో మూవీకి సంబంధించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు నిర్మాత నాగ వంశీ. ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వటానికి ప్రయత్నిద్దాం. ప్రేమతో మీ నాగవంశీ అంటూ రాసుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన ట్విట్ వైరల్‌గా మారింది.
ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం.
అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం.
మీ
Naga Vamsi— Naga Vamsi (@vamsi84) January 4, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

