Priyanka Chopra | పుట్టింటిలో ప్రియాంకా చోప్రా.. స్లిమ్, గ్లామరస్ లుక్కు నెటిజన్లు ఫిదా
అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో గ్లామరస్ పాత్రలతోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో స్టార్ హీరోలతో పోటీపడి నటించింది బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకున్న ఈ భామ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడింది. ఎప్పటికపుడు సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్లతో టచ్‌లో ఉంటూ అమెరికా నుంచే అప్డేట్స్ ఇస్తుంది.
అయితే ఈ సారి మాత్రం హోంటౌన్ నుంచి అప్డేట్ ఇచ్చి అందరిలో జోష్ నింపుతోంది. చాలా కాలం తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన ప్రియాంకా చోప్రా.. అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన క్షణాలను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ప్రియాంకా చోప్రా ముంబైలోని తన ఇంటిలో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇల్లు.. రాబోయే కొద్ది రోజుల కోసం ఎదురుచూస్తున్నా.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రియాంకా పోస్ట్‌కు కామెంట్ సెక్షన్లో బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. ప్రపంచంలో అందమైన అమ్మాయి..అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. మేం చాలా ఎక్జయిట్ అవుతున్నాం అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశాడు. ప్రియాంకా చోప్రా చివరగా 2016లో వచ్చిన జై గంగాజల్ హిందీ చిత్రంలో లీడ్ రోల్లో మెరిసింది. ఆ తర్వాత హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయింది.
ముంబైలోని నివాసంలో ఇలా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

