Prithviraj Sukumaran | పృథ్విరాజ్ సుకుమారన్ బర్త్ డే స్పెషల్.. సలార్ వరదరాజ మన్నార్ లుక్ వైరల్
Prithviraj Sukumaran | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ఈ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా సినిమా సలార్ (Salaar)లో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే.
Prithviraj Sukumaran | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). జనగణమన సినిమాతో తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా సినిమా సలార్ (Salaar)లో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ స్టార్ యాక్టర్ పుట్టినరోజు నేడు.
ఈ సందర్భంగా పృథ్విరాజ్ సుకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సలార్‌లో పృథ్విరాజ్ సుకుమార్ పోషిస్తున్న వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్‌ను షేర్ చేశారు. నుదుటన తిలకం, మెడ చుట్టూ స్కార్ప్ వేసుకొని స్టన్నింగ్ లుక్‌తో వరదరాజ మన్నార్ గా అదరగొట్టేస్తున్నాడు. సలార్ రెండుపార్టులుగా రాబోతుండగా.. సలార్ పార్ట్ 1ను డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ప్రభాస్ కాంబినేషన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సలార్ టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్న సలార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సలార్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

