Telangana Bommalu | మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తాజా చిత్రం ‘ప్రేమలు'(Premalu). ఫిబ్రవరి 09న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్(Fahad Fazil) నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడీ(Girish AD) దర్శకత్వం దర్శకత్వం వహించగా.. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమాను తెలుగులో మార్చి 08న విడుదల చేస్తున్నారు.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ తెలంగాణ బొమ్మలు (Telangana Bommalu) సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ చూస్తే.. మొత్తం హైదరాబాద్‌ని ఒక సాంగ్‌లో కవర్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పాటలో వచ్చిన చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్‌బండ్, తెలంగాణ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సీన్స్ అయితే సాంగ్‌కు హైలెట్‌గా నిలిచాయి. ఇక ఈ సాంగ్ చూసిన ఓ నెటిజన్లు మా అందమైన హైదరాబాద్‌ను ఎంతో ఆందంగా చూపించినందుకు ధన్యవాదాలు…! ప్రేమతో మీ తెలంగాణ పోరగాళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ పాటకు సుహైల్ కోయా లిరిక్స్ అందించగా.. కె జి మార్కోస్, విష్ణు విజయ్ పాడారు. విష్ణు విజయ్ సంగీతం అందించాడు.