డా॥మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. సినిమాలోని హీరో మోహన్ లుక్‌ను నటుడు ప్రకాష్‌రాజ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సమాజంలో నెలకొన్న ప్రధాన సమస్యను ఇతివృత్తంగా చేసుకొని అర్థవంతంగా మోహన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి చిత్రమిది’ అని తెలిపారు. మోహన్ మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. సందేశానికి కమర్షియల్ హంగులు మేళవిస్తూ తెరకెక్కించాం’ అని పేర్కొన్నారు.