వేసవిలో వినోదాల జల్లు
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా దర్శకులుగా పరిచయమవుతున్నారు దర్శకద్వయం నితిన్-భరత్. యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకులిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. తాము బుల్లితెరపై డిఫరెంట్ షోస్ చేశామని, అప్పటి నుంచే ప్రదీప్‌తో పరిచయం ఉందని చెప్పారు.
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా దర్శకులుగా పరిచయమవుతున్నారు దర్శకద్వయం నితిన్-భరత్. యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకులిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. తాము బుల్లితెరపై డిఫరెంట్ షోస్ చేశామని, అప్పటి నుంచే ప్రదీప్‌తో పరిచయం ఉందని చెప్పారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని, గ్రామీణ నేపథ్యంలో చక్కటి హాస్యంతో మెప్పిస్తుందని అన్నారు. ఈ సినిమాలో కామెడీ చాలా సహజంగా ఉంటుందని, బ్రహ్మానందం..సత్య పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయని తెలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ సినిమా బాగా నచ్చిందని, వేసవి రిలీజ్ బాగుంటుందని వారే సలహా ఇచ్చారని, ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇదని చెప్పారు. ‘మైత్రీ మూవీ మేకర్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. రథన్ మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాతే మరో సినిమా డైరెక్షన్ గురించి ఆలోచిస్తాం. కొన్ని కథలైతే సిద్ధంగా ఉన్నాయి’ అని నితిన్-భరత్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

