ఆకాష్లో పరిణతి వచ్చింది

‘పదేళ్ల అనుభవమున్న స్టార్లా ఆకాష్ నటించాడు. అతడి నటనలో పరిణతి కనిపిస్తున్నది’ అని అన్నారు అగ్రహీరో ప్రభాస్. ‘రొమాంటిక్’ చిత్ర ట్రైలర్ను మంగళవారం ఆయన విడుదలచేశారు. ఆకాష్పూరి, కేతిక శర్మ జంటగా నటించారు. అనిల్ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను అందిస్తూ ఛార్మితో కలిసి నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. ప్రభాస్ మాట్లాడుతూ ‘ట్రైలర్ రొమాంటిక్గా ఉంది. రమ్యకృష్ణ పాత్ర ఆసక్తిని కలిగిస్తున్నది’ అని తెలిపారు. మంచితనంతో ప్రభాస్ తానే స్వయంగా ఈ చిత్రాన్ని ప్రోత్సహించడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని పూరి జగన్నాథ్ చెప్పారు. ఛార్మి మాట్లాడుతూ ‘స్వచ్ఛమైన ప్రేమ గొప్పతనాన్ని చాటే చిత్రమిది. వాస్కో, మౌనిక అనే జంట ప్రేమ ప్రయాణానికి చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది. ఆకాష్, కేతిక కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఇందులోని ప్రత్యేకగీతం సర్ప్రైజ్ చేస్తుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

