Imanvi esmail | నేను పాకిస్థానీని కాదు.. స్పందించిన ప్రభాస్ హీరోయిన్
Prabhas Fauji | జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే.
Prabhas Fauji | జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులపై మళ్లీ వ్యతిరేకత మొదలైంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఒక ప్రాజెక్ట్‌లో ఇమాన్ ఎస్మాయిల్ అనే హీరోయిన్ నటిస్తుండగా.. ఇమాన్ పాకిస్థాన్‌కి చెందిన నటి అని.. ఆమెను మూవీ నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఇమాన్ ఎస్మాయిల్ స్పందించింది. తాను పాకిస్థాన్‌కి చెందిన అమ్మాయిని కాదని.. తాను ఇండో అమెరికన్ అని రాసుకోచ్చింది.
పహల్గాంలో జరిగిన విషాద సంఘటనకు సంబంధించి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. అమాయక ప్రాణాల నష్టం ఎంతో బాధాకరం. ఈ ఘటన నా హృదయాన్ని కలచివేసింది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ ద్వారా వెలుగు, ప్రేమను పంచడమే నా లక్ష్యంగా ఉన్నందున, మనమందరం ఒకేతాటిపైకి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.
రీసెంట్గా నేను పాకిస్థాన్‌కి చెందిన నటిని అంటూ వస్తున్న వార్తలు వైరలవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను కానీ నా కుటుంబం కానీ పాకిస్తాన్ సైన్యంతో సంబంధం కలిగి లేరు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్‌ని. నా తల్లిదండ్రులు యుక్త వయసులో చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చిన తర్వాత నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాను. వారు అనంతరం అమెరికన్ పౌరులుగా మారారు. అమెరికాలో నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటిగా, కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు సాధించాను. ఈ గుర్తింపు అనంతరం నాకు ఇండియన్ సినిమాలలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినీ పరిశ్రమ నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతీయ గుర్తింపు సంస్కృతి నా రక్తంలోనే ఉన్నందున, సోషల్ మీడియాను ఐక్యత కోసం ఉపయోగిస్తానని.. విభజన కోసం కాదని ఆశిస్తున్నాను. చరిత్రలో కళ అనేది సంస్కృతులు, వ్యక్తులు, మరియు అనుభవాల మధ్య అవగాహన, సానుభూతి, సంబంధాన్ని సృష్టించే మాధ్యమంగా ఉంది. నా పని ద్వారా ఈ వారసత్వం కొనసాగేలా.. నా భారతీయ వారసత్వ అనుభవాలను ఉత్తేజపరిచేలా నేను కఠినంగా శ్రమిస్తాను అంటూ ఇమాన్ చెప్పుకోచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

