Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసుల నోటీసులు..!
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోటు చేస్తున్న టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సహా మంది పోలీసులు సోమవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోటు చేస్తున్న టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సహా మంది పోలీసులు సోమవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియ, యూట్యూబర్, కమెడియన్ టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. విచారణ తర్వాత మరికొందరికి సైతం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన ఇతర వ్యక్తులపై సైతం పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, టీవీ నటుల్లో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురిపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్స్ లింక్స్ ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

