Akhil Raj | ఫుడ్ డెలివరీ వివాదం.. హీరో అఖిల్ రాజ్‌కు షాక్.. పోలీస్ స్టేషన్‌కు చేరిన గొడవ!
Akhil Raj | 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అఖిల్ రాజ్ ఉద్దెమరి ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఫుడ్ డెలివరీ విషయంలో మొదలైన చిన్న గొడవ క్రమంగా తీవ్ర రూపం దాల్చి, ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.
Akhil Raj | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అఖిల్ రాజ్ ఉద్దెమరి ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఫుడ్ డెలివరీ విషయంలో మొదలైన చిన్న గొడవ క్రమంగా తీవ్ర రూపం దాల్చి, ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. వివరాలలోకి వెళితే గత నెల 28న హైదరాబాద్‌లోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న అఖిల్ రాజ్ నివాసానికి రమేశ్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున నాన్-వెజ్ పార్సిల్ అందజేశాడు. వాస్తవానికి ఆ ఆర్డర్ ఎదురుగా ఉన్న మరో అపార్ట్‌మెంట్‌కు వెళ్లాల్సి ఉండగా, తప్పుగా హీరో ఇంటికి చేరింది. తన తప్పును గుర్తించిన డెలివరీ బాయ్ వెంటనే క్షమాపణ చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ విషయంలో హీరో అఖిల్ రాజ్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌పైకి దూసుకెళ్లిన దృశ్యాలను రమేశ్ తన మొబైల్లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను క్షమాపణ చెప్పినా తనపై దాడికి ప్రయత్నించారని, హీరో తల్లి తనపై ఉమ్మివేసి అవమానించారని ఆరోపించాడు. ఈ ఆరోపణలపై స్పందించిన అఖిల్ రాజ్ వీడియో విడుదల చేశారు. డెలివరీ బాయ్ మద్యం మత్తులో వచ్చి తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని, అందుకే తాను ఆవేశానికి లోనై స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పూర్తి ఘటన కనిపించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.
వీడియో వైరల్ కావడంతో అఖిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెలివరీ బాయ్ తన కుటుంబాన్ని దూషించడమే కాకుండా, పరువు నష్టం కలిగించే ఉద్దేశంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం అఖిల్ రాజ్ తన తల్లిదండ్రులతో కలిసి కారులో ఆలయానికి వెళ్తుండగా, రమేశ్ తన స్నేహితులతో కలిసి వారి కారును అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కారుపై రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారని సమాచారం. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు రమేశ్‌తో పాటు అతని స్నేహితుడు సందీప్ సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి నిజానిజాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్‌పై దాడి
కొండాపూర్‌లో అఖిల్ రాజ్ కారును అడ్డగించి దాడికి ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు
గచ్చిబౌలి పీఎస్‌లో పిర్యాదు
డెలివరీ బాయ్‌పై కూడా పిర్యాదు చేసిన అఖిల్ రాజ్
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు https://t.co/oHuuCkBYOL pic.twitter.com/fsgjVuTJU8
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhil raj
- Assault
- Case
- delivery boy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

