Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడమే కాకుండా, రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకున్న ‘పెద్ది’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నేటి నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది. అయితే ఓటీటీ విడుదలతో పాటు అభిమానులకు మేకర్స్ మరో స్పెషల్ సర్ప్రైజ్ కూడా అందించారు. థియేటర్లలో కనిపించని కొన్ని అదనపు సన్నివేశాలను ఓటీటీ వెర్షన్లో జోడించారు. సినిమా నిడివి కారణంగా తొలగించిన కొన్ని ఎమోషనల్, క్యారెక్టర్ బిల్డింగ్ సన్నివేశాలను ఇప్పుడు తిరిగి చేర్చడంతో కథ మరింత సంపూర్ణంగా అనిపిస్తోందని ఇప్పటికే చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక క్షణాలు, భావోద్వేగ సన్నివేశాలు ఈ కొత్త వెర్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు.
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ గ్రామీణ యువకుడిగా కనిపించి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, క్రీడా నేపథ్యం కలగలిపిన ఈ కథలో ఆయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్ తన పాత్రలో చక్కటి అభినయాన్ని కనబరిచారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం మరో ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. అలాగే ప్రముఖ నటులు జగపతి బాబు , శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగ కథనం, స్పోర్ట్స్ అంశాలు, అద్భుతమైన విజువల్స్‌తో ‘పెద్ది’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.