Pawan Kalyan | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. కొత్త ప్రాజెక్ట్ కోసమేనా.!
Pawan Kalyan | సంక్రాంతి పండుగ వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది.
Pawan Kalyan Meets Producer TG Vishwa Prasad | సంక్రాంతి పండుగ వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. భోగి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, సరికొత్త ఆరంభాలకు నాంది పలుకుతూ పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు చిత్రాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్‌తో పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గతంలో వీరి మధ్య జరిగిన ప్రాథమిక చర్చలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాబోయే భారీ ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ భాగస్వామ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే చిత్రాలకు సంబంధించి ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. రాజకీయ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తన కోసం ఎదురుచూస్తున్న నిర్మాతలు, అభిమానుల కోసం తన సినీ కమిట్మెంట్లను వేగవంతం చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ భేటీతో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లైన్-అప్పై స్పష్టత రావడంతో మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Marking the spirit of new beginnings on the auspicious occasion of Bhogi, and taking forward earlier discussions on upcoming projects, Sri @PawanKalyan met with @peoplemediafcy Producer Sri @vishwaprasadtg for further deliberations.#PawanKalyanCreativeWorks pic.twitter.com/GPQAAiQ6BN
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

