P. Samuthirakani | పవన్ కళ్యాణ్ తో వంద సినిమాలు తీయడానికైనా నేను సిద్ధం : సముద్రఖని
Bro Movie | సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తమిళంలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Bro Movie | సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తమిళంలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూలై 28న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. దానికితోడు ఇటవలే రిలీజైన ఫస్ట లుక్ పోస్టర్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా సముద్రఖని ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. త్వరలోనే టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పటికే టీజర్ కట్ కు సంబంధించిన పనులు స్టార్ట్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, సెకండ్ ఆఫ్ డబ్బింగ్ పనులు త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ తో రెండవ సినిమా చేస్తారా అని యాంకర్ ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ గారితో వంద సినిమాలు చేయడానికైనా రెడీగా ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు. నా దగ్గర చాలా కథలున్నాయని, ఆయన నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. సినిమా చేసేందుకు నేను రెడీగా ఉంటానని తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కుతుంది. ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

