ప్రేక్షకుల నవ్వులు చూడాలని ఉంది
సొహైల్, మృణాళిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకాలపై కోనేరు కల్పన నిర్మిస్తున్నారు.
సొహైల్, మృణాళిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకాలపై కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా జరిగిన కార్యక్రమంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…‘చాలా విరామం తర్వాత నేను రూపొందించిన పూర్తి వినోదాత్మక సినిమా ఇది. డైలాగ్స్ బాగుంటాయి. నా కెరీర్ ప్రారంభం నుంచీ ప్రోత్సహిస్తున్నారు అచ్చిరెడ్డి. ఓ మంచి సినిమా చేస్తున్నామనే నమ్మకంతో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఉత్సాహంగా పనిచేశారు. రేపు థియేటర్లో ప్రేక్షకులు నవ్వే నవ్వులు చూడాలని వేచి ఉన్నాము’ అన్నారు.
నటి మీనా మాట్లాడుతూ..‘నేను ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించాలని చాలా సార్లు అనుకున్నా ఎందుకనో కుదరలేదు. ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’ అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ..‘ఎస్వీ కృష్ణారెడ్డి గారి వింటేజ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చూస్తాం. ఇంతమంది సీనియర్స్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ..‘మార్చిలో విడుదల చేసేందుకు నిర్మాత కల్పన సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారి తరహా వినోదం, సందేశం ఈ సినిమాలో చూస్తారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

