Cinema News | సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామ్ గోదాల దర్శకుడు. వి ఆర్ట్స్, చిత్రలహరి టాకీస్ పతాకాలపై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి నిర్మిస్తున్నారు. మాళవిక మనోజ్ కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, దర్శకుడు వశిష్ట కెమెరా స్విఛాన్ చేశారు. ఇదొక అందమైన ప్రేమకథా చిత్రమని దర్శకుడు తెలిపారు.
కథానుగుణంగా మంచి ఆర్టిస్టులు కుదిరారని, వైవిధ్యమైన కథతో అన్ని వర్గాలను మెప్పిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెడుతున్నానని ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హస్సానందని చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, సంగీతం: రథన్, ఆర్ట్: బ్రహ్మ కడలి, కో ప్రొడ్యూసర్: ఆనంద్ గడగోని, రచన-దర్శకత్వం: రామ్ గోదాల.