Ramabanam Movie | రామబాణం మూవీ నుంచి నువ్వే నువ్వే సాంగ్ రిలీజ్
Ramabanam Movie Songs | గతకొంత కాలంగా గోపిచంద్ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్‌లో వరుస హిట్లతో జోరు చూపించిన గోపిచంద్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. నిజానికి గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది.
Ramabanam Movie Songs | గతకొంత కాలంగా గోపిచంద్ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్‌లో వరుస హిట్లతో జోరు చూపించిన గోపిచంద్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. నిజానికి గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు. మధ్యలో ‘జిల్’, ‘గౌతమ్ నందా’, ‘సీటిమార్’ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. ఇక గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ‘పక్కా కమర్షియల్’ పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కు తీసుకురాలేకపోయింది. దాంతో తనకు అచ్చొచ్చిన దర్శకుడు శ్రీవాస్‌ను నమ్ముకుని ‘రామబాణం’ సినిమాతో వస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై కాస్తో కూస్తో మంచి బజ్నే క్రియేట్ చేశాయి. పైగా ఈ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను సమ్మర్కానుకగా మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే చిత్రబృందం వెల్లడించింది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని నువ్వే నువ్వే అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మిక్కి జే మేయర్ స్వర పరిచిన ఈ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రితేష్ ఆలపించాడు.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటిస్తుంది. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అటు గోపిచంద్‌కు, ఇటు శ్రీవాస్‌కు ఇద్దరికి హిట్టు చాలా అవసరం. శ్రీవాస్ కూడా గతకొంత కాలంగా లైమ్‌లైట్‌లో లేడు. లౌక్యం తర్వాత ఆయన తెరకెక్కించిన డిక్టేటర్, సాక్ష్యం డిజాస్టర్లుగా మిగిలాయి. మరీ ఈ సినిమాతో అయినా వీరిద్దరూ గట్టెక్కుతారో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

