అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ఇటీవల జన్మదినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్-ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ‘హ్యాపీ బర్త్‌డే బావా. ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ అల్లు అర్జున్‌కు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు ఎన్టీఆర్. ‘థాంక్యూ ఫర్ యువర్ లవ్లీ విషెస్ బావా. వార్మ్ హగ్స్’ అంటూ బన్నీ రిైప్లె ఇచ్చాడు. దీనికి ఎన్టీఆర్ ‘ఓన్లీ హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప’ అంటూ సరదాగా స్పందించారు. ఎన్టీఆర్ ట్వీట్‌పై బన్నీ ‘వస్తున్నా’ అంటూ ఎన్టీఆర్ 30 సినిమా డైలాగ్‌ను గుర్తుచేస్తూ బదులిచ్చాడు. ఇలా ఇద్దరు అగ్ర హీరోలు తమ సినిమాల్లోని డైలాగ్స్‌ను గుర్తుచేసుకుంటూ చేసిన సరదా సంభాషణ వైరల్‌గా మారింది.