పునీత్ రాజ్‌కుమార్ పేరుకి శాండల్‌వుడ్ నటుడు అయిన అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌తో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా తెలుగులో ఆయన చాలా మంది స్టార్స్‌తో సన్నిహితంగా మెలిగారు. ముఖ్యంగా పునీత్ రాజ్‌కుమార్‌కు, ఎన్టీఆర్(NTR)కు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆంధ్రావాలా విపరీతమైన క్రేజ్ మధ్యలో విడుదలయింది. కానీ ఆశించినంత ఫలితాలను మాత్రం అందించలేకపోయింది. దీనిని కన్నడలో ‘వీర కన్నడిగా’ టైటిల్‌తో రీమేక్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. ఇది పునీత్, ఎన్టీఆర్ మధ్య ఫ్రెండ్షిప్ బలపడేలా చేసింది.
ఎమ్ శరవణన్ దర్వకత్వంలో పునీత్ రాజ్‌కుమార్(Puneet raj kumar) నటించిన చిత్రం ‘చక్రవ్యూహ’. ఇందులో ఒక పాట పాడడం కోసం ఎన్టీఆర్‌కు పర్సనల్‌గా ఆఫర్ ఇచ్చారు పునీత్. ‘గెలెయా గెలెయా’ అంటూ సాగే ఈ పాట అప్పట్లో చాలా వైరల్‌గా మారింది. పునీత్ మరణవార్త విన్న ఎన్టీఆర్ ‘నమ్మలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది’ అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన అంత్యక్రియలలో పాల్గొనేందుకు జూనియర్ బెంగళూరు వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, పునీత్ దివంగత తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి పక్కనే శనివారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కర్మకాండలు నిర్వహిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ తెలిపారు.