Sai pallavi | నీచమైన చర్య.. గ్రూప్ ఫొటోను క్రాప్ చేసి.. దాని అర్థమే మార్చేసి, పెళ్లంటూ ప్రచారం: సాయిపల్లవి
ఈ సోషల్ మీడియా కాలంలో వ్యూస్ కోసం, న్యూస్ కోసం లేనిపోనివి సృష్టించి రాయడం పరిపాటైపోయింది. ఇలాంటి వార్తల వల్ల మనస్తాపానికి గురైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారిలో సాయిపల్లవి కూడా చేరింది.
Sai pallavi | ఈ సోషల్ మీడియా కాలంలో వ్యూస్ కోసం, న్యూస్ కోసం లేనిపోనివి సృష్టించి రాయడం పరిపాటైపోయింది. ఇలాంటి వార్తల వల్ల మనస్తాపానికి గురైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారిలో సాయిపల్లవి కూడా చేరింది. సాయిపల్లవి ఏనాడూ పరిధిని దాటి ప్రవర్తించలేదు. తెరపై డిగ్నిఫైడ్‌గా కనిపిస్తుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుంది. తనపై రూమర్లు కూడా తక్కువే. వచ్చినా పట్టించుకోదు. కానీ ఇటీవల వచ్చిన ఓ రూమర్ ఆమెను బాగా బాధపెట్టింది. తమిళదర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో సాయిపల్లవి ఉన్న ఫొటోను కొందరు నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. పూలదండలు మెడలో వేసుకొని పక్కపక్కనే నిలబడ్డ వారిద్దరి ఫొటోను పోస్ట్ చేసి ‘సాయిపల్లవి పెళ్లయిపోయింది.
ఇదిగో సాక్ష్యం.. ఇంతకీ ఆ పెళ్లికొడుకు ఎవరో తెలుసా?’ అంటూ క్యాప్షన్లు పెట్టారు. ఈ ఫొటో, రూమర్లు చివరికి సాయిపల్లవి ఇంట్లోకి కూడా వెళ్లిపోయాయి. ఆమె తల్లిదండ్రులు కూడా ఈ రూమర్ల వల్ల మనస్తాపానికి లోనయ్యారని సాయిపల్లవి తెలిపింది. తనపై వచ్చే ఏ రూమర్నీ పట్టించుకోని సాయిపల్లవి, తొలిసారి ఈ రూమర్‌పై ట్విటర్ ద్వారా స్పందించింది. “ రూమర్లను నేను పట్టించుకోను. కానీ కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా బాధపడేంత నీచంగా పుకార్లను సృష్టిస్తుంటే తప్పక స్పందిస్తున్నా. నేను నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ గ్రూప్ ఫొటోను క్రాప్ చేసి, దాని అర్థమే మార్చేసి, పెళ్లంటూ ప్రచారం చేయటం నీచమైన చర్య. నా సినిమా అప్డేట్స్ గురించి మాట్లాడాల్సిన సందర్భంలో ఇలాంటి నీచమైన విషయం గురించి మాట్లాడాల్సిరావడం బాధగా ఉంది” అంటూ వాపోయారు సాయిపల్లవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

