FIFA 2026 | ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) ఘనంగా ప్రారంభమైంది. కెనడాలోని టొరంటో సిటీలో జరిగిన రెండవ ఓపెనింగ్ వేడుకలలో స్టేజ్‌పై బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, గ్లోబల్ ఐకాన్ నోరా ఫతేహి (Nora Fatehi) తన పర్ఫార్మెన్స్తో దుమ్మురేపింది. కెనడా వర్సెస్ బోస్నియా మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ వేడుకల్లో ఆమె వేదికపై నిప్పులు చెరిగే డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
రెడ్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన నోరా ఫతేహి.. ఈ ఫిఫా టోర్నమెంట్ అధికారిక ఆల్బమ్ లోని ‘సీర్ సీర్’ (Siir Siir) అనే గ్లోబల్ ఫుట్‌బాల్ యాంథమ్‌ను లైవ్‌గా ఆలపించి, డ్యాన్స్ చేసింది. ఈ ప్రదర్శనలో ఆమెతో పాటు ప్రసిద్ధ ఫ్రెంచ్ సింగర్ వెజిడ్రీమ్ (Vegedream), ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంజోయ్ (Sanjoy) కూడా జతకలిశారు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఈ హై-ఎనర్జీ సాంగ్‌కు స్టేడియంలోని వేలాది మంది అభిమానులు ఫిదా అయిపోయారు. కెనడాలోనే పుట్టి పెరిగిన నోరా ఫతేహి, ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్‌గా ఎదిగింది. ఇప్పుడు మళ్లీ తన సొంత గడ్డపై, ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ వేదికపై పర్ఫార్మ్ చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ ‘సీర్ సీర్’ అనే పాటను మొరాకో ఫుట్‌బాల్ స్టేడియం చాంట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలతో పాటు బలమైన భారతీయ సంస్కృతి, డ్యాన్స్ ఎలిమెంట్స్ కూడా బ్యాక్‌స్టేజ్‌లో భాగమయ్యాయని నోరా పేర్కొంది. గతంలో 2022 ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో అలరించిన నోరా, ఇప్పుడు 2026 ఫిఫా ప్రారంభ వేడుకల్లోనూ మెరిసి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించింది.
Tô chocadooo, a Nora Fatehi (do clipe indiano Saki Saki) cantou um funk na abertura da Copa 😲 pic.twitter.com/9EOTMoVs0P
— marcos iglesia 🤰🏻🪽 (@marcos_iglesia_) June 12, 2026
La cantante canadiense de origen marroquí, Nora Fatehi, se sumó al rapero francés Vegedream y al DJ de Bangladesh Sanjoy para interpretar “Siir Siir” en la apertura del #MundialDeFútbol en Canadá 🇨🇦pic.twitter.com/2UByjkyNPU
— Ceremoniólogo 🏟🎆 (@ceremoniologo) June 12, 2026