నెగెటివ్ ప్రచారం భరించక తప్పదు!

సోషల్మీడియాలో తనపై వచ్చే నెగెటివ్ ప్రచారం గురించి అస్సలు పట్టించుకోనని చెప్పింది ఢిల్లీ భామ కియారా అద్వాణీ. ప్రజల్లో విపరీతమైన ప్రాచుర్యం కలిగి ఉండే సినీరంగంలో తారల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడం సహజమని..వ్యతిరేక ప్రచారాన్ని కెరీర్లో ఓ భాగంగా స్వీకరిస్తానని పేర్కొంది. గతంలో తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా దుష్ప్రచారం చేశారని, అయినా సహనాన్ని పాటించాలనని చెప్పుకొచ్చింది. ‘అనుకున్న విధంగా ఫొటోలకు ఫోజులు ఇవ్వకపోడంతో నాపై అహంకారి అనే ముద్ర వేసి ప్రచారం చేశారు. వివిధ సాంఘిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ కామెంట్స్ పెట్టారు. అలాంటి వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఇలాంటి నెగెటివిటీని భరించక తప్పదు. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. దానివల్ల కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అందుకే నేను సంయమనం పాటిస్తా. అయితే మా అమ్మనాన్న మాత్రం నెగెటివ్ ప్రచారాన్ని గమనిస్తుంటారు. ఎవరైనా పరిధులు దాటి విమర్శిస్తే నాకు తెలియజేస్తారు’ అని చెప్పింది కియారా అద్వాణీ. ఆమె కథానాయికగా నటించిన ‘షేర్షా’ ఇటీవలే ఓటీటీలో ప్రేక్షకులముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

