హృదయానికి దగ్గరైన చిత్రం
అగ్ర కథానాయిక నయనతార నటించిన తాజా తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’ దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రెజీనా, ఖుష్బూ, స్నేహ, ఊర్వశి, యోగిబాబు ప్రధాన పాత్రల్ని పోషించారు.
అగ్ర కథానాయిక నయనతార నటించిన తాజా తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’ దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రెజీనా, ఖుష్బూ, స్నేహ, ఊర్వశి, యోగిబాబు ప్రధాన పాత్రల్ని పోషించారు. 2020లో విడుదలై విజయవంతమైన ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్ ఇది. ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నయనతార సోషల్‌మీడియాలో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకుంది.
‘ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. దర్శకుడు సుందర్ సి నా ఆలోచనలు, అభిరుచికి అద్దం పట్టేలా అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ప్రయాణంలో ప్రతీ అడుగు అర్థవంతంగా అనిపించింది. నటిగా, వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రంగా నిలిచిపోతుంది’ అని నయనతార తన పోస్ట్‌లో పేర్కొన్నది. తొలిభాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన..సీక్వెల్ బాధ్యతలను సుందర్ సి చేపట్టారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

