Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్-2’. సుందర్. సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘మహాశక్తి’ అనే పేరు పెట్టారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమైంది.
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్-2’. సుందర్. సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘మహాశక్తి’ అనే పేరు పెట్టారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నయనతార తన భావాలను ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా ఎన్నో రోజులు హృదయంలో నిలిచిపోయిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్. సీపై నయనతార ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. తన విజన్, ప్రేమ, అభిరుచిని సినిమాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సుందర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి సందర్భంలోనూ చూపిన శ్రద్ధ ఈ ప్రయాణాన్ని మరపురానిదిగా మార్చిందని చెప్పారు. ఈ సినిమా కోసం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని నమ్మి, తమకు అండగా నిలిచిన నిర్మాత ఐసరి కె. గణేష్‌కు నయనతార ధన్యవాదాలు తెలిపారు. కథను మనస్ఫూర్తిగా నమ్మి మద్దతు ఇచ్చే నిర్మాత ఉండటం వల్ల సినిమా ప్రయాణం ఎంతో సజావుగా సాగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ఖుష్బూ, స్నేహల గురించి కూడా నయనతార ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిద్దరితో కలిసి నటించిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, ఇద్దరిపైనా తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని తెలిపారు. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
‘మూక్కుత్తి అమ్మన్-2’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నయనతార వెల్లడించారు. చిత్ర బృందమంతా కలిసి సృష్టించిన ప్రపంచాన్ని ప్రేక్షకులు చూసి ఆనందించాలని కోరుకున్నారు. తన లేఖ చివరలో ‘ఓం శక్తి’ అంటూ ముగించారు. ఇక ‘మూక్కుత్తి అమ్మన్-2’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మొదటి భాగానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. సుందర్. సీ దర్శకత్వం, నయనతార ప్రధాన పాత్ర, ఖుష్బూ, స్నేహ వంటి ప్రముఖ నటీనటుల భాగస్వామ్యంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

