డబ్బుల కోసం సినిమాలు చేయను
నృత్యకళ ద్వారా ప్రజల ఆలోచనవిధానంలో మార్పును తీసుకురావడమే కాకుండా మూఢనమ్మకాలను చెరిపేయవచ్చని చాటిచెప్పే చిత్రమిదని అన్నారు సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఈ నెల 22న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో సంధ్యారాజు పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి…

బాల్యంలోనే నృత్యం పట్ల నాలో ఇష్టం మొదలైంది. ఈ కళ ఔన్నత్యాన్ని గురించి ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజెప్పాలనే ఆలోచనతోనే సినిమాను రూపొందించాం. ఇప్పటివరకు వెయ్యికిపైగా నృత్యప్రదర్శనలిచ్చాను. ఈ వేదికలతో పోలిస్తే సినిమా మాధ్యమం ద్వారా నాట్యకళ పట్ల ఎక్కువమంది ప్రజల్లో అవగాహన కలిగించవచ్చనిపించింది. దర్శకుడు రేవంత్‌తో ఇదివరకు ఓ లఘు చిత్రం చేశాను. అతడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాలో నటిస్తూనే నిర్మించాను. నాట్యకళ ద్వారా ఓ అందమైన కథ చెప్పే ప్రయత్నం చేశాం.
గురుశిష్యుల అనుబంధం
నాట్యం అనే కల్పిత ఊరిలో ఈ కథ సాగుతుంది. గురుశిష్యుల అనుబంధంతో పాటు సంప్రదాయ నృత్యాలకు ఉండే పరిమితులు, క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్‌ల మధ్య ఉండే భేదాలను ఇందులో ఆవిష్కరించాం. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ ఉంటుంది. ఊరి ప్రజల్లో పేరుకున్న మూఢనమ్మకాలను నాట్యం ద్వారా ఓ మహిళ ఎలా చెరిపివేసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇండస్ట్రీలో కొత్తవాళ్లకు సరైన ప్రోత్సాహం ఉండదు. రాజకీయాలు, నెగిటివిటీ ఎక్కువగా ఉంటాయని ప్రచారం జరుగుతుంటుంది. కానీ అది అబద్దమని ఈ సినిమాతో తెలుసుకున్నా. కంటెంట్ నచ్చడంతో చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌తో పాటు చాలా మంది స్టార్స్ ఈ సినిమాకు అండగా నిలిచారు. నాట్యం పట్ల నాకున్న ఇష్టం, తపనను గ్రహించిన కుటుంబసభ్యులు సినిమా చేస్తానంటే కాదనలేదు.
‘యూటర్న్’ రీమేక్‌లో నటించా.
నటన, నిర్మాణం రెండు బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూ సినిమాను పూర్తిచేయడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. గతంలో కొన్ని లఘు చిత్రాలు చేశాను. మలయాళంలో ‘యూటర్న్’ రీమేక్‌లో నటించా. డబ్బులు, మార్కెట్ లెక్కల కోసం నేను సినిమాలు చేయను. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథాంశాల్లో నటించాలనుంది. అలాంటి సినిమాల కోసం అన్వేషిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గ్యాస్ రిఫైనరీ ఉద్యోగుల బస్సు బోల్తా.. 12 మంది దుర్మరణం..!
KCR | హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీకంలో పాల్గొన్న కేసీఆర్.. వీడియో
KTR | రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ఎక్స్‌లో కేటీఆర్
IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. పుణె ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్..!
Crazy Kalyanam | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

