Nandu | షాకింగ్ విషయాలు చెప్పిన హీరో నందు .. రోజుకు 100 నుంచి 150 సిగరెట్లు కాల్చాల్సి వచ్చేది..
Nandu | నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ కీలక పాత్రల్లో నటించారు. మే 22న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Nandu | నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ కీలక పాత్రల్లో నటించారు. మే 22న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “‘అగ్లీ స్టోరీ’లో నేను పోషించిన కార్తీక్ పాత్ర నా కెరీర్లో చాలా ప్రత్యేకం. హీరోగా కనిపించే వ్యక్తి ప్రతినాయకుడి కోణంలో ఉండే కథలు తెలుగులో చాలా అరుదుగా వస్తాయి. అందుకే ఈ సినిమా నాకు ఛాలెంజ్‌గా అనిపించింది” అని అన్నారు.
షారుఖ్ ఖాన్ నటించిన ‘డర్’, ‘బాజీగర్’, అలాగే ఫాహద్ ఫాజిల్ చేసిన ‘22 ఫిమేల్ కొట్టాయం’ సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నానని నందు తెలిపారు. “ప్రతి సినిమాలో రాముడి లాంటి పాత్రలే చూస్తుంటాం. కానీ రావణాసురుడి కోణంలో కథ చెప్పాలని అనిపించింది. ఆ ఆలోచనతోనే ఈ సినిమా చేశాను” అని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోయానని నందు వెల్లడించారు. “ఒక షెడ్యూల్ సమయంలో రోజుకు 100 నుంచి 150 సిగరెట్లు కాల్చాల్సి వచ్చేది. నిజానికి నాకు సిగరెట్లు అంటే అసహ్యం. కానీ పాత్ర కోసం చేయాల్సి వచ్చింది. ఇంటికి వెళ్లాక తీవ్ర తలనొప్పి, చిరాకు వచ్చేది” అని చెప్పారు.
అంతేకాకుండా దర్శకుడు ప్రణవ్ తన భార్య గీతా మాధురికి ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పారని నందు గుర్తుచేసుకున్నారు. షూటింగ్ జరుగుతున్న రోజులలో మా హీరో ఇంట్లో విలన్లా ప్రవర్తించినా ఏమనుకోవద్దని గీతాకు డైరెక్టర్ చెప్పాడు. ఎందుకంటే నేను పూర్తిగా క్యారెక్టర్ మూడ్‌లో ఉండిపోయేవాడిని అని తెలిపారు. కొన్ని రోజులు ఇంటికి వెళ్లాక కూడా ఒంటరిగా రూమ్‌లో ఉండిపోయేవాడినని నందు చెప్పారు. “పిల్లలతో ఆడుకునే మూడ్‌లో కూడా ఉండేవాడిని కాదు. పాత్ర మానసికంగా చాలా ప్రభావం చూపించింది” అని వెల్లడించారు. హీరోయిన్ అవికా గోర్ కూడా సినిమా గురించి భావోద్వేగంగా మాట్లాడారు. “నా కెరీర్లో తొలిసారి ఒక సినిమా చేస్తూ అసౌకర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈ కథలోని పరిస్థితులు నిజ జీవితంలో కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు. అది నాకు చాలా బాధ కలిగించింది” అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

