నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…‘ఓ జంట మధ్య పదేండ్ల పాటు సాగే ప్రేమ కథ ఇది. వీరి ప్రేమ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. నాయకా నాయికల పాత్రల ప్రయాణంలోకి ప్రేక్షకులు వెళ్తారు. ఇంద్రధనుస్సులా ఏడు రంగుల్లో ప్రేమను ప్రదర్శించబోతున్నాం. మాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’ అన్నారు. మేఘ చౌదరి, అశోక్ కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్ నామ, సంగీతం : కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్.