Hansika Motwani Interview | ఇలాంటి సినిమా రావడం ఇదే తొలిసారి : మై నేమ్ ఈజ్ శృతిపై హన్సికా మోత్వానీ
Hansika Motwani Interview | పాపులర్ బ్యూటీ హన్సికా మోత్వానీ (Hansika Motwani) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My Name Is Shruthi). శ్రీనివాస్ ఓంకార్ (Srinivas Omkar) దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసింది హన్సికా మోత్వానీ.
Hansika Motwani Interview | పాపులర్ బ్యూటీ హన్సికా మోత్వానీ (Hansika Motwani) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My Name Is Shruthi). శ్రీనివాస్ ఓంకార్ (Srinivas Omkar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. మై నేమ్ ఈజ్ శృతి నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసింది హన్సికా మోత్వానీ.
సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తారా..?
నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం.. స్కిన్ మాఫియా చుట్టూ తిరిగే అంశాలపై ఫోకస్ పెట్టే డార్క్ థ్రిల్లర్ కథాంశంతో సినిమా సాగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఇదే తొలిసారి. ఇందులో శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంది. శృతి ఏ విషయాన్ని అంత తేలికగా తీసుకోని ఓ ఫైటర్.
సినిమా కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు..?
మా అమ్మ డెర్మటాలజిస్ట్ (చర్మ వ్యాధి నిపుణులు). స్కిన్ మాఫియా నిజంగా జరిగిందా..? అని అడిగా. స్కిన్ మాఫియా గురించి చదివినట్టు అమ్మ నాతో చెప్పింది. సామాన్య ప్రజలకు ఈ మాఫియా గురించి అంతగా తెలియదని చెప్పారు. తన పరిశోధనలో తేలిన కొన్ని విషయాల ఆధారంగా డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ సినిమా చేశారు.
షూటింగ్ టైంలో ఛాలెంజింగ్‌గా అనిపించిన విషయం..
స్క్రిప్ట్కనుగుణంగా వెళ్లడం చాలా సవాలుతో కూడిన అంశం. కథలో చాలా ట్విస్టులు, మలుపులుంటాయి. థ్రిల్లర్ స్పేస్‌లో సినిమా చేయడం నాకు చాలా నచ్చింది. సినిమా రూపుదిద్దుకున్న తీరు పట్ల సంతోషంగా ఉంది.
తెలుగు సినిమాలు ఎక్కువగా చేయడం లేదు..?
నా చేతిలో ఎప్పటికీ తమిళ సినిమాలు ఫుల్‌గా ఉంటాయి. అక్కడ చాలా బిజీ.. అందుకే తెలుగు సినిమాల విషయంలో గ్యాప్ వచ్చింది. నా కెరీర్ విషయంలో ఎలాంటి విచారం లేదు. చాలా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. నేనింకా చాలా సాధించాలనుకుంటున్నా.
తెలుగులో మీ ఫేవరేట్ హీరోలెవరు..?
నా కెరీర్ తొలినాళ్లలో అల్లు అర్జున్, ప్రభాస్‌తో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నా. వారి సినిమాలు భాషాసరిహద్దులను చెరిపేశాయి. ఉన్నత స్థాయికి చేరుకున్నా.. ఒదిగి ఉండే స్వభావం కలిగిన వ్యక్తులు.
Welcome to the edge of anticipation for unveiling the suspense crime in 1 day! ❤️🔥#MyNameIsShruthi Trailer trending on youtube🔥https://t.co/HBm9SNfPOz#MyNameIsShruthiOnNov17 @ihansika @srinivasomkar6 #MuraliSharma #JayaPrakash @Poojaram22 #Ashika #Praveen #Prema… pic.twitter.com/ZGGyEhfIAg
— Ramesh Bala (@rameshlaus) November 16, 2023
మై నేమ్ ఈజ్ శృతి ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

