Hansika BirthDay .. మై నేమ్ ఈజ్ శృతి ఫస్ట్ లుక్ విడుదల

దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ హన్సిక మోత్వాని. యంగ్ ఏజ్‌లోనే ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలు చేసిన హన్సిక రాను రాను అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో హన్సిక కాస్త గ్యాప్ తీసుకుంది. ఆ మధ్య ‘తెనాలి రామకృష్ణ’ అనే సినిమాలో కనిపించి అలరించింది. అయితే ఇప్పుడు హన్సిక ప్రధాన పాత్రలో ‘మై నేమ్ ఈజ్ శృతి’. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షికగా ఉన్న చిత్రం రూపొందుతుంది.
వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. ‘బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్ థ్ల్రిలర్ ఉంటుందట. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం . ఇది ప్రేక్షకులకి మంచి అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ అంటున్నారు.
ఈ రోజు హన్సిక బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో హన్సిక సీరియస్ లుక్‌లో ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మురళీశర్మ, జయప్రకాష్, ఆడుకాలం నరెన్, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్క్.కె.రాబిన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఎలాంటి ఎడిటింగ్ లేకుండా 105 నిమిషాల పాటు సింగిల్‌షాట్‌లో తెరకెక్కే సినిమాలో హన్సిక సోలో పర్ఫామెన్స్ చేసినట్టు చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

