Samyukta Menon | విరూపాక్షతో నా ప్రయాణం సుదీర్ఘమైంది.. సంయుక్తా మీనన్ చిట్ చాట్
Samyukta Menon | సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం విరూపాక్ష (Virupaksha). మలయాళ భామ సంయుక్తా మీనన్ (Samyukta Menon) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఏప్రిల్ 21న విరూపాక్ష థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సంయుక్తామీనన్ మీడియాతో చిట్ చాట్ చేసింది. సినిమా విశేషాలు సంయుక్తా మీనన్ మాటల్లోనే..
Samyukta Menon | టాలీవుడ్ యాక్టర్ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష (Virupaksha). మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ మూవీలో మలయాళ భామ సంయుక్తా మీనన్ (Samyukta Menon) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఏప్రిల్ 21న విరూపాక్ష థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సంయుక్తామీనన్ మీడియాతో చిట్ చాట్ చేసింది. సినిమా విశేషాలు సంయుక్తా మీనన్ మాటల్లోనే..
మీ పాత్ర ఎలా ఉండబోతుంది..?
పర్వత ప్రాంతంలో ఉండే రుద్రవనం అనే గ్రామం నేపథ్యంలో విరూపాక్ష సాగుతుంది. నా పాత్ర ఎక్కువ ఆటిట్యూడ్ ఉండేలా కనిపించాలని డైరెక్టర్ కోరారు. ఇందులో చాలా ఆటిట్యూడ్ ఉన్న నందినీ అనే పల్లెటూరి యువతిగా కనిపిస్తా.
నందినీ పాత్రకు మీకు ఏమైనా సారూప్యతలున్నాయా..?
రెండూ పూర్తిగా భిన్నమైనవి. గ్రామంలో పుట్టి పెరిగిన చాలా ఎనర్జిటిక్ క్యారెక్టర్ నందిని పాత్ర. నందినీకి నాకు మధ్య ఉన్న పోలికలు ఇవే.
విరూపాక్ష మీరు సంతకం చేసిన మొదటి తెలుగు సినిమానా..?
బింబిసార తర్వాత నేను సంతకం చేసిన రెండో సినిమా. పలు కారణాల వల్ల విరూపాక్ష చాలా టైం తీసుకుంది. నేను చదివిన నా మొదటి డైలాగ్ ఇంకా గుర్తుంది. విరూపాక్షతో నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అప్పుడు నాకు తెలుగు తెలియదు. ప్రస్తుతం నాకు ట్యూటర్ ఉన్నారు.
సుకుమార్‌తో మీ ప్రయాణం గురించి..?
కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలోనే సుకుమార్‌ను కలిశా. చాలా ప్రొడక్షన్స్ వర్క్ పూర్తయిన తర్వాత ఆయన సినిమా చూసేవారు. సుకుమార్‌తో డైరెక్టర్ కార్తీక్ ప్రత్యేక సెషన్ పెట్టుకునేవారు. అలా సినిమా ప్రయాణం సాగింది.
విరూపాక్షను ఏ జోనర్ సినిమా అనొచ్చు..?
ఇది మిస్టికల్ థ్రిల్లర్. హార్రర్ సినిమా కాదు. కానీ జనాలు కొంత భయపడతారు. అది ప్రేక్షకుల రియాక్షన్ ను బట్టి ఉంటుంది. నేను ఘోస్ట్‌గా నటించడం లేదు. ఈ సినిమా 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.
సాయిధరమ్‌తేజ్, మీ పాత్రతోపాటు ఎవరి పాత్ర హైలెట్ అవుతుంది..?
ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. స్క్రీన్‌ప్లే గొప్పదనం అది. ప్రతీ పాత్రకు అంతర్గతంగా కనెక్షన్ ఉంటుంది. విరూపాక్షలో కష్టతరమైన పార్ట్ అదే. చాలా సార్లు ఫ్రేమ్‌లో 6-7 పాత్రలు కనిపిస్తాయి. అంతేకాదు సినిమాలో జంతువులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది.
మీ కొత్త సినిమాల గురించి..
విరూపాక్ష తర్వాత డెవిల్ విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేశాం. మరో రెండు నెలల్లో విడుదలవుతుంది. డెవిల్ తర్వాత మరే సినిమాకు సైన్ చేయలేదు. పలువురు దర్శకనిర్మాతలతో చర్చలు కొనసాగుతున్నాయి. విరూపాక్ష విడుదల తర్వాత నిర్ణయం తీసుకుంటా. నా పాత్ర చూసి జనాలు ఎలా స్పందిస్తారో చూడాలనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

