MS Subbulakshmi | ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్కు సన్నాహాలు.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో భారీ ప్రాజెక్ట్, హీరోయిన్ ఎవరు?
MS Subbulakshmi | భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత గాథను వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఆమె గానమాధుర్యం, ఆధ్యాత్మికత, సాధన ఇవన్నీ కలిసి భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తిత్వం.
MS Subbulakshmi | భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత గాథను వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఆమె గానమాధుర్యం, ఆధ్యాత్మికత, సాధన ఇవన్నీ కలిసి భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తిత్వం. అలాంటి గొప్ప గాయని జీవితం ఆధారంగా తెరకెక్కబోయే బయోపిక్‌పై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. తన సినిమాల్లో భావోద్వేగాలను అద్భుతంగా మలచడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన గౌతమ్, ఈ బయోపిక్‌ను కూడా అంతే నైపుణ్యంతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రావడం విశేషం.
సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, రీసెర్చ్ వంటి అంశాలపై మేకర్స్ చాలా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితంలోని కీలక ఘట్టాలను నిజానికి దగ్గరగా, ప్రేక్షకులకు హృదయానికి హత్తుకునేలా చూపించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన అంశం ప్రధాన పాత్ర ఎంపిక. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఎవరు పోషిస్తారు అన్నదానిపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఒక దశలో సాయి పల్లవి పేరు బలంగా వినిపించింది. ఆమె సహజ నటన, నృత్య నైపుణ్యం, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఈ పాత్రకు సరిపోతాయని చాలామంది భావించారు.
కానీ ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. యువ నటి రుక్మిణీ వసంత్ ఈ బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎన్.టి.ఆర్తో కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ బయోపిక్ అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది. రుక్మిణీ వసంత్‌కి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, క్లాసికల్ లుక్, భావ వ్యక్తీకరణ సామర్థ్యం వంటి అంశాలు ఈ పాత్రకు ప్లస్ అయ్యే అవకాశముంది. అయితే, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను పోషించడం అంటే కేవలం నటన మాత్రమే కాదు, సంగీతంపై లోతైన అవగాహన, బాడీ లాంగ్వేజ్ , స్వర మాధుర్యం వంటి అనేక అంశాలు అవసరం. అందుకే మేకర్స్ ఈ ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటికీ, నటీనటుల ఎంపికపై స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

