కథలు నచ్చక..కాస్త విరామం!
తొమ్మిది నెలలుగా తాను ఒక్క చిత్రాన్ని కూడా అంగీకరించలేదని అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రంలో ఈ భామ కీలక పాత్రను పోషిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తొమ్మిది నెలలుగా తాను ఒక్క చిత్రాన్ని కూడా అంగీకరించలేదని అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రంలో ఈ భామ కీలక పాత్రను పోషిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘గత తొమ్మిది నెలలుగా ఏ సినిమాకూ సంతకం చేయలేదు. ఆఫర్లు బాగానే వస్తున్నాయి. కానీ కథలు నా మనసుకు నచ్చడం లేదు.
అందుకే సినిమాలకు విరామం తీసుకున్నా. ఒక సినిమా కోసం మూడునాలుగు నెలల సమయాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. అంత సమయాన్ని కేటాయిస్తున్నామంటే కథలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా’ అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ‘రాకా’ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నదని, ఆమె షూటింగ్లో కూడా పాల్గొంటున్నదని ముంబై సినీ వర్గాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకూ చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

