టికెట్ ధరలు పెంచమని వేడుకుంటే తప్పేముంది : చిరంజీవి
Acharya Movie | తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య టికెట్ ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆచార్య సినిమా విడుదలకు సంబంధించి మీడియాతో చిరంజీవి ఇవాళ మాట్లాడారు. ప్రపంచంలో కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయి. అన్ని రంగాల్లాగే సినిమా రంగం కూడా నష్టపోయిందని తెలిపారు. కరోనా వల్ల బడ్జెట్‌పై వడ్డీలకు వడ్డీలు పెరిగాయని చెప్పారు. తాము ప్రభుత్వాలకు 42 శాతం పన్ను కడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలను వేడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. వినోదాన్ని పంచుతున్నందుకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చిరంజీవి తెలిపారు. నటులకు ప్రేక్షకులు ఇంతా అని ఇస్తున్నారు.. అందులో తప్పేముందన్నారు చిరంజీవి.
ఇక ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్, పూజా హెగ్డే నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ నుంచి మొదటి పది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్ లో రూ.50 పెంచుకునేందుకు, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతోపాటు వారం రోజుల పాటు ఆచార్య ఐదో ఆటకు కూడా అనుమతి లభించింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

