బ్రిటిష్‌వారిపై డేవిడ్‌రెడ్డి పోరాటం
హీరో మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’గా రానున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంతో ఉద్రేకపూరితమైన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నది.
హీరో మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’గా రానున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంతో ఉద్రేకపూరితమైన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో క్రూరులైన బ్రిటిష్ పాలకులపై ఎదురు నిలిచి పోరాడిన యోధుడిగా మనోజ్ కనిపిస్తారు. మారియా ర్యబోషష్క ఇందులో కథానాయిక. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానున్నది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లని మేకర్స్ విడుదల చేశారు.
రూత్ లెస్‌గా బ్రూటల్‌గా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న మంచు మనోజ్‌ని ఈ పోస్టర్లలో చూడొచ్చు. ఈ సినిమా ఆద్యంతం యాక్షన్ అంశాలతో రూపొందుతున్నదని ఈ రెండు పోస్టర్లు చెబుతున్నాయి. ‘డేవిడ్ రెడ్డి’గా మనోజ్ విశ్వరూపం చూపిస్తున్నారని, ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారని, మనోజ్ బాడీ లాంగ్వేజ్, లుక్స్, నటన ఇవన్నీ ఇందులో కొత్తగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. హీరోగా ఆయనకు ఈ సినిమా బెస్ట్ కంబ్యాక్ అవుతుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆర్.పార్తీబన్, కాంచన తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సంగీతం: రవి బస్రూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

