Malla Reddy| సర్ప్రైజ్ అంటే ఇది కదా.. నితిన్‌తో కలిసి మల్లా రెడ్డి చేసిన డ్యాన్స్ మాములుగా లేదుగా..!
Malla Reddy| లవర్ బోయ్ నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చాలా కష్టపడి టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్‌కి ఈ మధ్య సక్సెస్‌లు పలకరించడం లేదు.
Malla Reddy| లవర్ బోయ్ నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చాలా కష్టపడి టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్‌కి ఈ మధ్య సక్సెస్‌లు పలకరించడం లేదు. ‘అ ఆ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో భారీ మార్కెట్‌ను సొంతం చేసుకున్న నితిన్, చివరగా వచ్చిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’తో మాత్రం డౌన్ ఫౌల్ చవి చూశాడు. 78 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అ ఆ టాప్ పొజిషన్లో నిలిచినప్పటికీ, రీసెంట్గా వచ్చిన సినిమాలు 10-15 కోట్లకే పరిమితం కావడం నితిన్‌ని చాలా ఆవేదనకి గురి చేశాయి. ఎంత కష్టపడినప్పటికీ నితిన్‌కి మాత్రం సరైన విజయాలు దక్కడం లేదు.
తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ అతనికి లైఫ్-చేంజింగ్ మూవీగా మారనుందని అంటున్నారు. నితిన్‌కి భీష్మ చిత్రం ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ఈ సినిమా తర్వాత మళ్లీ నితిన్‌కి సక్సెస్ లేదు. 2020లో వచ్చిన ‘భీష్మ’ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు అదే సక్సెస్‌ను పునరావృతం చేయాలని నితిన్ వెంకీతో కలిసి రాబిన్ హుడ్ చిత్రం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా, కనీసం 30 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగగా, ఈ టార్గెట్ సాధించడం అంత తేలికైన పని కాదు అని అంటున్నారు.
గత కొద్ది రోజులుగా నితిన్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. పలు ప్రాంతాలని చుట్టేస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్… మల్లారెడ్డికి చెందిన కాలేజీకి వెళ్లారు. ఈ ఈవెంట్ లో నితిన్, మల్లారెడ్డి కలిసి “అది దా సర్ ఫ్రయిజ్” అనే పాటకు డాన్స్ చెయ్యగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . తెలంగాణ మాజీ మంత్రి, విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి ఎంత హుషారుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సినిమాలంటే ఇష్టం. సినిమా వాళ్లన్న కూడా చాలా ఇష్టం. వారితో కలిసి ఆయన చేసే సందడి మాములుగా ఉండదు. బోళాతనం మల్లారెడ్డి పద్దతి కాగా, 70 ఏళ్ల వయసులో ఇప్పటికీ హుషారుగా ఉంటారు. పలువురు సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ లు చేస్తూ అప్పుడప్పుడు వార్తలలో నిలుస్తుంటారు.
Moment of the day 💥💥💥#MallaReddy Garu and @actor_nithiin dance to the trending #AdhiDhaSurprisu song
during team #Robinhood‘s visit to Malla Reddy Institute of Medical Sciences ❤🔥❤🔥GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/oqq8l3HZh2
— Mythri Movie Makers (@MythriOfficial) March 19, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dance
- Malla Reddy
- Nithin
- Robin Hood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

